నిలిచి పోయిన గణేష్ శోభ యాత్ర.. ఎందుకో తెలుసా…?

నిలిచి పోయిన గణేష్ శోభ యాత్ర.. ఎందుకో తెలుసా...?

0
33

సాధారణంగా ఎక్కడైనా భారీ ఊరేగింపులు సాగుతున్నప్పుడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. అయితే కొన్నిసార్లు మాత్రం అనుకోని సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అలాంటప్పుడు ప్రజలు వ్యవహరించే తీరుపై బాధితుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. తాజాగా అలాంటి ఆసక్తికర సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలో ఉన్న పుణే లోని లక్ష్మీ రోడ్డులో గురువారం గణేష్ నిమజ్జనం శోభ యాత్ర ప్రారంభమైంది. అయితే అనారోగ్యంతో ఉన్న వ్యక్తినీ ఎక్కించుకొని అంబులెన్స్ లక్ష్మీ రోడ్డుకు చేరుకుంది. అయితే అక్కడ భారీ ఎత్తున ఊరేగింపు సాగడంతో అంబులెన్సు ముందుకు వెళ్లేందుకు దారి కనిపించలేదు.

దీంతో అంబులెన్స్ ను గమనించిన ప్రజలు మానవత్వంతో వ్యవహరించారు. వెంటనే అందరూ తప్పుకొని అంబులెన్స్ వెళ్లేందుకు రోడ్డు క్లియర్ చేశారు. అంబులెన్స్ వెళ్లినా అనంతరం శోభయాత్ర యధావిధిగా ముందుకు సాగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఊరేగింపు సందర్భంగా పూనే వాసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.