గన్నవరం సెగ్మెంట్ పై బాబు కీలక నిర్ణయం

గన్నవరం సెగ్మెంట్ పై బాబు కీలక నిర్ణయం

0
112

ఏపీలో మ‌రో ఉప ఎన్నిక అనివార్యం అని నిన్న వల్లభనేని వంశీ విమర్శలతో అర్దం అయింది. బహుశా ఈ నెలలో వంశీ రాజీనామా ఆమోదం చెందే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దీంతో కచ్చితంగా ఆరు నెలలలోపు గన్నవరంలో ఉప ఎన్నిక వస్తుంది.. ఈ సమయంలో యార్లగడ్డ, వంశీ ఇద్దరూ వైసీపలో ఉన్నారు కాబట్టి టికెట్ ఎవరికి ఇస్తారో జగన్ డెసిషన్ అది.

ఇక వైసీపీ మాత్రం వారిద్దరిలో ఒకరిని ఫైనల్ చేస్తుంది. బాబు కూడా దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారట. అక్కడ ఆమోదముద్ర స్పీకర్ వేయగానే ఇక్కడ గన్నవరం బాధ్యతలు పార్టీలో సీనియర్ కు అప్పచెబుతారట. అయితే పార్టీ తరపున కమిట్మెంట్ ఉన్న నేతకు ఇక్కడ బాధ్యత ఇస్తారు అని తెలుస్తోంది. మొత్తానికి బాబు గన్నవరం ఎవరికి వరం చేయబోతున్నారు అనే చర్చ టీడీపీలో సాగుతోంది.