జగన్ కే నా ఓటు టీడీపీ నేత

జగన్ కే నా ఓటు టీడీపీ నేత

0
86

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ఇటీవలే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించారు… దీనిపై టీడీపీ నాయకులు జనసేన నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ బీజేపీ నాయకులు స్వాగతిస్తున్నారు…

అయితే ప్రాంతాలపరంగా టీడీపీకి చెందిన కొంతమంది విశాఖ నేతలు జగన్ కే జై కొడుతున్నారు… అందులో ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…. జగన్ ప్రకటనను ఆయన మొదటినుంచి స్వాగతిస్తున్న సంగతి తెలిసిందే…

ఇదే క్రమంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు గంటా… కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ అన్ని విధాలా అర్హమైనదని అన్నారు.,… విశాఖ పౌరుడిగా ఈ నగరంతో తనకున్న అనుబంధం కారణంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటనకు స్వాగతిస్తున్నానని తెలిపారు…