గంటా ముహూర్తం పెట్టేసుకున్నారు ఇంక ఎవరూ ఆపలేరు

0
88

విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాసరావు చరిష్మా అందరికి తెలిసిందే, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అధికారం ఉంటుంది ..కాని ఈసారి ఎన్నికల్లో మాత్రం దానికి రివర్స్ అయింది. ఆయన గెలిచారు కాని తెలుగుదేశం ఓటమి పాలైంది, ముఖ్యంగా వైసీపీ గెలవడంతో ఆయనకు మంత్రి పదవి దూరం అయింది. అయితే ఐదు నెలలు పదవికి దూరంగా ఉన్న గంటా కచ్చితంగా పార్టీ మారుతారు అని వార్తలు వచ్చాయి.

ఆయన వైసీపీలో చేరుతారు అని వార్తలు వచ్చినా అది జరుగలేదు. తాజాగా ఆయన మాత్రం ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్దం అయ్యారట.. ఇక వైసీపీ కాదు కొడితే కుంభస్థలం కొట్టాలని బీజేపీపై ఫోకస్ చేశారు. గంటా రాజకీయం చూస్తే, తెలుగుదేశం ప్రజారాజ్యం, కాంగ్రెస్ మళ్లీ టీడీపీ ఇలా పార్టీలు మారారు. తాజాగా ఆయన ఈ నెల 10 బీజేపీ రథసారధి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారు అని వార్తలు వస్తున్నాయి,

మాజీ కేంద్ర మంత్రి సలహా మేరకు బీజేపీలోకి వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారట. అంతేకాదు ఉత్తరాంధ్రా బీజేపీ పగ్గాలు గంటాకి ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వైసీపీకి సరైన ధీటైన నాయకుడిగా విశాఖలో గంటాని తెరపైకి తీసుకువస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.