తెలుగుదేశం పార్టీలో గంటా శ్రీనివాసరావు ఉండరు అని ఆయన పార్టీ మార్పు షురూ అని వార్తలు వినిపించాయి.. అంతేకాదు ఆయన పార్టీ మారడమే కాదు నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునేందుకు సిద్దం అవుతున్నారు అని వార్తలు వచ్చాయి.. ఇటీవల మాత్రం ఆయన పార్టీ మారేది లేదు అని తెలియచేశారు. కాని చంద్రబాబు లోకేష్ మరి కొంత మంది సీనియర్లు మాత్రం ఇటీవల గంటా గురించి ఎక్కడ చర్చించలేదు ..అయితే బీజేపీలోకి వెళ్లినా అక్కడ వంశీలా ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా ఉన్నా వారిని గుర్తించినా ఈ ఐదు సంవత్సరాల్లో వారికి వచ్చేది ఏమీ ఉండదు. సెగ్మెంట్ లో బీజేపీ వారు మాత్రమే వెనుక ఉంటారు. తెలుగుదేశం కేడర్ దూరం అవుతుంది.
అందుకే తాజాగా ఆయన మాత్రం పార్టీకి గుడ్ బై చెప్పడానికి ఇష్టం చూపించడం లేదు అని తెలుస్తోంది.. మరీ ముఖ్యంగా సీనియర్లు జూనియర్లు చాలా మంది పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. గంటా మాత్రం పార్టీ మారాలి అని భావించడం లేదు.. దీనికి కారణం అదే అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. మరోసారి రాజకీయంగా తనకు గెలుపు కష్టం అవుతుంది అని గంటా భావిస్తున్నారట.
అయితే వైసీపీ నుంచి ఆఫర్ వచ్చినా ఎమ్మెల్చే పదవికి రాజీనామా చేసినా ఎప్పుడో ఇచ్చే ఎమ్మెల్సీ కోసం ఎందుకు పార్టీ మారడం అని ఆగుతున్నారు.. అందుకే పార్టీ మారినా వైసీపీలో కూడా తేడా ఏమీ ఉండదు.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ ఎమ్మెల్సీ అవుతారు. అందుకే పార్టీ మార్పు పై ఆయన డెసిషన్ వెనక్కి తీసుకున్నారు అంటున్నారు అక్కడ కేడర్.