చిరు దగ్గర ‘గంట’మోగిందిగా..

చిరు దగ్గర ‘గంట’మోగిందిగా..

0
97

ఏపీ వ్యాప్తంగా సైరా నరసింహారెడ్డి సినిమా గురించి చర్చ సాగుతోంది… ఈ చిత్రంలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అద్బుతంగా నటించారు… ఇటు తెలుగులోనూ అటు హిందీలో సైరా మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది… నిన్న చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా జరుపుకుంది ..

అయితే ఈ క్రమంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవి కలిశారు… ఈ సందర్భంగా తన ఆనందాన్ని గంటా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు… సైరా చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిరంజీవిని కలవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని గంటా పేర్కొన్నారు…

ఈ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపాలు… గంటా పూల బుకే ఇస్తున్న సమయంలో చిరు అలింగనం చేసుకున్న ఫోటోను కూడా ట్వీట్ చేశారు. పక్కనే నిర్మాత అల్లూ అరవింద్ కూడా ఉన్నారు..