గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలంటే ఈ కండీషన్స్

గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరాలంటే ఈ కండీషన్స్

0
109

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి… 2019 ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోవడంతో అధినేత చంద్రబాబునాయుడు రిపేర్లు చేసే పనిలో పడ్డారు… ఈ క్రమంలో తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.. ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వైసీపీ తీర్ధం తసుకున్నారు…

నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతు ఇచ్చారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోక ముందే మరో బిగ్ షాక్ తగిలింది…. ఆపార్టీకి చెందిన కీలక నేత మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారంటూ మళ్లీ వార్తలు వస్తున్నాయి… త్వరలో మంచి ముహూర్తం చూసుకుని ఆయన వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు…

వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ విజయసాయిరెడ్డి అన్నారు… వ్యక్తుల కోసం తమ పార్టీ సిద్దాంతాలను మార్చుకోమని అన్నారు… వైసీపీలో ఎవరైనా చేరాలంటే ముందుగా రాజీనామా చేయాలనేది పార్టీ సిద్దాంతమని అన్నారు విజయసాయి రెడ్డి….