గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం

గంటా ఆస్తుల వేలానికి రంగం సిద్దం

0
85

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు సంబంధించిన ఆస్తులను వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ సిద్దమైంది… ప్రత్యూషా రిసోర్స్ అండ్ ఇన్ర్ఫా ప్రైవేట్ లిమిటెడ్ పేరుమీద ఇండియన్ బ్యాంక్ నుంచి గంటా శ్రీనివాస రావు భారీగా రుణం తీసుకున్నారు…

అయితే తీసుకున్న రుణాలకు గంటా బాకాయిలను సకాలంలో కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు అక్టోబర్ నాలుగున నోటీసులను పంపించింది.. నోటీసులకు సంబంధించి గంటా నుంచి సరైన సమాధానం రాకపోవడంతో డిసెంబర్ 20న ఆస్తుల వేళం వేయాలని బ్యాంక్ నిర్ణయించింది…

రుణాల మొత్తం విలువ 290 కోట్లుగా ఉన్నట్లు సమాచారం… అంతేకాదు గంటాకు సంబంధించిన వ్యక్తిగతమైన ఆస్తిని స్వాదీనం చేసుకునే హక్కు ఉందని బ్యాంకు తెలిపింది…