ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆయనకు సంబంధించిన ఆస్తులను ఈ నెల 25న వేలం వేస్తున్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు… ప్రత్యూష కంపెనీకి చెందిన 9 రకాల వివరాలను వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది…
286 కోట్ల రుణాలను తీసుకుని తిరిగి చెల్లించలేదు. అలాగే వడ్డీ కూడా గంటా శ్రీనివాస రావు చెల్లించకపోవడంతో ఆయనకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్లు అధికారులు తెలిపారు… కాగా 2019 ఎన్నికల్లో గంటా టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు…
ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీలో చేరుతారని కొందరు చర్చించుకోగా మరి కొందరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వచ్చాయి అయితే ఇంతవరకు ఆయన ఏ పార్టీలో చేరలేదు…