గ్యాస్ వినియోగదారులు కొత్తగా వచ్చిన ఈ నాలుగు రూల్స్ తెలుసుకోండి

గ్యాస్ వినియోగదారులు కొత్తగా వచ్చిన ఈ నాలుగు రూల్స్ తెలుసుకోండి

0
96

నవంబర్ నుంచి గ్యాస్ వినియోగదారులకి కొత్త రూల్స్ వచ్చాయి, పలు మార్పులు కూడా వచ్చాయి, మరి వినియోగదారులు తప్పక తెలుసుకోండి… ఇక మీరు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే నవంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ వినియోగదారుల రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఈ నెంబర్ డెలివరీ బాయ్ కు ఇస్తేనే మీకు గ్యాస్ డెలివరీ ఇస్తారు.

కచ్చితంగా మీ మొబైల్ నెంబర్ అక్కడ నమోదు చేయించుకోవాలి, ఆధార్ కార్డ్ నెంబర్ వారికి సమర్పించాలి. ఇక మరో మార్పు ఏమిటి అంటే. ఇండేన్ గ్యాస్ కస్టమర్లు కంపెనీ బుకింగ్ నెంబర్ను మార్చేసింది. ఇదివరకు కంపెనీకి గ్యాస్ బుకింగ్కు ఒక్కో సర్కిల్లో ఒక్కో నెంబర్ ఉండేది. కాని దేశవ్యాప్తంగా ఒకే నెంబర్ ఉంటుంది.

మీకు గ్యాస్ కావాలి అంటే 7718955555 నెంబర్కు కాల్ చేసి, లేదా ఎస్ఎంఎస్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునేవారు కచ్చితంగా ఆధార్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిందే, ఒకవేళ ఎవరైనా సబ్ మీట్ చేయకపోతే మీ గ్యాస్ కంపెనీకి వెళ్లి అప్ డేట్ చేసుకోవాలి.