ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత త్రివిధ దళాల అధిపతులలో సీనియర్‌గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సీడీఎస్ మరణంతో ఈ స్థానం ఖాళీగా ఉంది.
ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించారు. ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా..నేవీ చీఫ్‌గా అడ్మిరల్ ఆర్ హరి కుమార్ నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం 2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్‌గా కొనసాగుతున్నారు.
సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్.. ఛైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం వల్ల..ఈ హోదా ఖాళీగా ఉంది. సీడీఎస్ పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్‌గా ఉన్న వ్యక్తి ఛైర్మన్‌గా వ్యవహరించేవారు.