ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మేకతోటి సుచరిత..

0
112

ఏపీ రాష్ట్రంలో నిన్న కొత్త కేబినేట్‌లో మొత్తం 25 మంది మంత్రులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో నేడు నూతన మంత్రివర్గం కొలువుతీరనుంది. గ‌తంలో మంత్రులుగా ఉన్న వారిలో 11 మందికి వైఎస్ జ‌గ‌న్ అవ‌కాశం ఇచ్చారు. అయితే చాలామంది మంత్రి పదవిని ఆశించారు. కానీ దక్కకపోవడంతో జగన్ పై చాలా కోపంగా ఉన్నారు. గ‌త కేబినెట్ లో రాష్ట్ర హోం మంత్రిగా మేక‌తోటి సుచ‌రిత ప‌ని చేశారు.

తాజాగా మేక‌తోటి సుచ‌రిత‌ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని..అందరికి షాక్ ఇచ్చింది. తన ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసింది. తనకు కొత్త కేబినేట్‌లో మంత్రి అవకాశం ఇవ్వకపోయేసరికి తీవ్ర మనస్థాపానికి గురయ్యి స్పీక‌ర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు. త‌న రాజీనామా లేట‌ర్ ను కూడా పంపించారు. మంత్రి పదవి‌ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదని మేకతోటి సుచరిత మండి పడ్డారు. ఈ కొత్త కేబినెట్ ఏర్పాటు వల్ల జగన్ కు ఇంకా ఎన్ని సమస్యలు తలెత్తుతాయో చూడాలి.