బంగారంతో మాస్క్ ఖ‌రీదెంతో తెలిస్తే షాక్

బంగారంతో మాస్క్ ఖ‌రీదెంతో తెలిస్తే షాక్

0
85

ఒక్కోక్క‌రు ఒక్కో రకంగా ఆలోచిస్తారు, ఇన్నోవేటీవ్ ఆలోచ‌న‌లు చాలా మందికి ఈ రోజుల్లో వ‌స్తున్నాయి, వాటిని ఆచ‌ర‌ణ‌లో పెడుతున్నారు, ఈ క‌రోనా స‌మ‌యంలో చాలా మంది జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, బ‌య‌ట‌కు వ‌స్తే శానిటైజ‌ర్ తో పాటు మాస్క్ షీల్డ్ అనేది చాలా మంది పెట్టుకుంటున్నారు.

అయితే సాధార‌ణంగా మాస్క్ చేయించుకుంటే స్పెష‌ల్ ఏమి ఉంంది అని అనుకున్నాడో ఏమో ఏకంగా బంగారంతో మాస్క్ చేయించుకున్నాడు.. పుణెకు చెందిన ఓ వ్యక్తి బంగారు మాస్క్‌ను పెట్టుకున్నాడు. పింప్రి చించ్‌వాడకు చెందిన శంకర్ కుర్‌హేడ్ అనే వ్యక్తి సుమారు 2 లక్షల 90 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు.

దీని చూసి అంద‌రూ భ‌లే ఉంది అంటున్నారు, సుమారు 50 గ్రాముల బంగారం వాడారు, అంటే లెక్క వేసుకోండి, గ్రాము 5 వేలు చొప్పున 50 గ్రాముల బంగారం దీనికి వాడారు. అత‌నికి బంగారం అంటే ఇష్టం ఉంగ‌రాలు చెయిన్స్ తోపాటు ఇది కూడా అత‌ని ముఖం పై మెరుస్తూ క‌నిపిస్తోంది, సుమారు 2.80 ల‌క్ష‌లు దీని త‌యారీకి అయింది అని చెబుతున్నారు.