బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది, నేడు కూడా బంగారం ధర మార్కెట్లో కాస్త తగ్గింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల కారణంగా దేశీయ మార్కెట్‌లోనూ పసిడి తగ్గుతోంది. ఇక బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం కాస్త పెరుగుదల కనిపిస్తోంది.
ఇక హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది. దీంతో ధర రూ.55,650కు తగ్గింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా దిగొచ్చింది. 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.51,000కు చేరింది.
ఇక వెండి ధర మాత్రం మార్కెట్లో కాస్త పెరుగుదల కనిపించింది.. కేజీ వెండి ధర రూ.1050 పైకి కదిలింది. దీంతో ధర రూ.68,000 చేరింది. వెండికి యూనిట్స్ నుంచి డిమాండ్ పెరగడమే ధర పెరుగుదలకు కారణం అంటున్నారు, ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు.