టాలీవుడ్ లో మ‌రో న‌టుడి పెళ్లి – సిరివెన్నెల ఇంట్లో క‌ల్యాణం

టాలీవుడ్ లో మ‌రో న‌టుడి పెళ్లి - సిరివెన్నెల ఇంట్లో క‌ల్యాణం

0
64

టాలీవుడ్ లో వ‌ర‌సగా హీరోలు న‌టులు వివాహాలు చేసుకుంటున్నారు, ఇప్ప‌టికే లాక్ డౌన్ స‌మ‌యంలో ప‌లువురు హీరోలు ఓ ఇంటి వారు అయ్యారు, . ఇప్పటికే నితిన్, నిఖిల్, రానా పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివాళ్లైతే, నిహారిక నిశ్చితార్థం చేసుకుని పెళ్లి డేట్ కోసం ఎదురుచూస్తోంది.

ఈ స‌మ‌యంలో టాలీవుడ్ లో మ‌రో వివాహా వార్త వినిపిస్తోంది.ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడు చెంబోలు రాజా తన నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
ఇక ప‌లు సినిమాల్లో ఆయ‌న న‌టించారు అనేది తెలిసిందే.

ఫిదా సినిమాలో వరుణ్ తేజకు అన్నయ్యగా నటించిన రాజా, తన నిశ్చితార్థం ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇక భార్య గురించి ఎలాంటి విష‌యాలు వెల్ల‌డించ‌లేదు.. ఆయ‌న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, మిస్టర్ మజ్ను, రణరంగం వంటి పలు చిత్రాల్లో నటించారు. ప‌లు చిత్రాల‌కు ఇంకా ఆయ‌న సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది, లాక్ డౌన్ వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డ్డాయి, త్వ‌ర‌లో ఆయ‌న వివాహం కూడా జ‌రుగ‌నుంది.