ఆటలో అతనికి తిరుగులేదు కూల్ కెప్టెన్ గా భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు ధోని, అయితే ఇలా సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు, అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తూ రాత్రి 19.29 గంటలకు తన రిటైర్మెంట్‌ను ప్రకటన చేశాడు.
అయితే ఈ సమయం ఇలా చెప్పడానికి ఓకారణం ఉంది అంటున్నారు నెటిజన్లు అలాగే అభిమానులు..
19.29 నుంచి నేను రిటైర్ అయినట్టుగా భావించండి. అని ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశాడు..దీని మీద కొందరు కొన్ని రకాల వాదనలు చేశారు. ధోనీ చెప్పిన రిటైర్‌మెంట్ టైమ్, వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓడిపోయిన టైమ్ రెండూ రాత్రి 19.29 గంటలే అని అంటున్నారు.
అవును
19:29 : India lost against NewZealand.
19.29 : MS Dhoni’s retirement timing. ఈ రెండు ఒకే సమయం అందుకే ధోని ఇలా తన రిటైర్మెంట్ ను ప్రకటించాడు అంటున్నారు . దీనిపై సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి.