పరుగులు పెడుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు మార్కెట్లో మళ్లీ కాస్త తగ్గింది, నేడు పుత్తడి కాస్త ధర తగ్గింది, అయితే వెండి ధర మాత్రం కాస్త పరుగులు పెట్టింది, అంతర్జాతీయంగా పరిస్దితులు ఇలానే ఉన్నాయి అందుకే బంగారం ధర మరింత తగ్గుతోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,720కు చేరింది…అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.510 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,240కు పడిపోయింది.
పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.800 పైకి కదిలింది. దీంతో ధర రూ.66,300కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి, తగ్గే అవకాశాలు లేవు అంటున్నారు బులియన్ వ్యాపారులు.. మళ్లీ షేర్ల ర్యాలీ ఆగడంతో
బంగారం పెరుగుతుంది అని భావిస్తున్నారు, ఈ తగ్గుదల కొద్ది రోజులు మాత్రమే అని చెబుతున్నారు.