బ్రేకింగ్- తగ్గిన బంగారం ధర – వెండి ధ‌ర పైపైకి ఈరోజు రేట్లు ఇవే

బ్రేకింగ్- తగ్గిన బంగారం ధర - వెండి ధ‌ర పైపైకి ఈరోజు రేట్లు ఇవే

0
87

బంగారం ధ‌ర కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది మ‌ళ్లీ మార్కెట్లో, ఇక అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర త‌గ్గుద‌ల నేప‌థ్యంలో భార‌త్ లో కూడా బంగారం ధ‌ర త‌గ్గింది, ఇక వెండి ధ‌ర మాత్రం కాస్త మార్కెట్లో పెరిగింది, వెండి జిగేల్ మంటే పుత్త‌డి కాస్త ధ‌ర నెమ్మ‌దించింది, పుత్త‌డి వ‌రుస‌గా ఏడో రోజు కూడా త‌గ్గింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.140 దిగొచ్చింది. దీంతో ధర రూ.53,580కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.120 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.49,120కు పడిపోయింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.66,350కు చేరింది. ఇక వ‌చ్చే రోజుల్లో ప‌సిడి పెరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు అన‌లిస్టులు, ముఖ్యంగా 52 వేల వ‌ర‌కూ అప్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు, ఇక వెండి ఆల్ టైం హైకి మ‌రో నెల‌లో చేరే ఛాన్స్ ఉంద‌ట‌.