తగ్గిన బంగారం ధరలు ఈరోజు రేట్లు ఇవే

తగ్గిన బంగారం ధరలు ఈరోజు రేట్లు ఇవే

0
185

బంగారం ధర మళ్లీ మార్కెట్లో నేడు తగ్గుముఖం పట్టింది, నిన్న కాస్త పరుగులు పెట్టిన వెండి ధర మళ్లీ మార్కెట్లో కాస్త తగ్గింది, అయితే షేర్ల మార్కెట్ లో ఒడిదుడుకులు సమిసిపోయి కాస్త షేర్లు లాభపడ్డాయి దీంతో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు అందరూ.

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 దిగొచ్చింది. దీంతో ధర రూ.52,640కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.90 తగ్గింది. దీంతో ధర రూ.48,250కు పడిపోయింది.

ఇక వెండి ధర కూడా కాస్త తగ్గింది నేడు మార్కెట్లో. కేజీ వెండి ధర రూ.300 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.60,700కు చేరింది. ఇక వచ్చే రోజుల్లో మరింత వెండి ధరలు బంగారం ధరలు తగ్గుతాయి అంటున్నారు వ్యాపారులు.