భారీగా పెరిగిన బంగార ధ‌ర ఈ రోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగార ధ‌ర ఈ రోజు రేట్లు ఇవే

0
44

బంగారం ధ‌రల‌‌కు మ‌ళ్లీ రెక్క‌లు వ‌చ్చాయి… గ‌డిచిన వారం రోజులుగా డైలీ త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర మళ్లీ ప‌రుగులు పెట్టింది, నిన్న‌టి కంటే ఈరోజు మ‌ళ్లీ ధ‌ర‌లో పెరుగుద‌ల క‌నిపించింది..ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్లో గోల్డ్ ధ‌ర పెరిగింది. దీంతో బంగారం ధ‌ర ఇండియాలో పెరుగుతోంది. మ‌రి నేడు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం కూడా బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.53,310కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.50 పెరిగింది. దీంతో ధర రూ.48,870కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.890 పెరిగింది. దీంతో వెండి ధర రూ.63,800కు చేరింది. వ‌చ్చే రోజుల్లో బంగారం వెండి ధ‌ర‌లు మ‌రింత పెరుగుతాయి అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, గ‌డిచిన వారం రోజులుగా షేర్ల ర్యాలీ కొన‌సాగింది, అందుకే బంగారం త‌గ్గింది, ఇప్పుడు మళ్లీ షేర్ల ప‌త‌నంతో బంగారం ధ‌ర పెరుగుతోంది.