పసిడి ధర భారీగా పరుగులు పెడుతోంది, బంగారం ధర ఆల్ టైం హైకి చేరుకుంది, ఇటు వెండి కూడా ధర భారీగా పెరుగుతోంది, అంతర్జాతీయ ట్రేడ్ కు అనుగుణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక బంగారం బాటలోనే వెండి ధర ఇలా పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరిగింది. దీంతో ధర రూ.52,200కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది.. 10 గ్రాముల బంగారం ధర రూ.760 పెరుగుదలతో రూ.47,850కు చేరింది.
ఇక వెండి ధర కూడా భారీగా పరుగులు పెట్టింది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.3350 పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.3350 పెరగడంతో ధర రూ.58,950కి చేరింది, ఇంత భారీగా రేట్లు పెరగడంతో అందరూ షాక్ అయ్యారు, అయితే వచ్చే రోజుల్లో బంగారం మరింత పెరుగుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.