గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న చంద్రబాబు

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న చంద్రబాబు

0
120

సిఎం జగన్ చేతల మనిషి ప్రచారానికి ఆయనెప్పుడు దూరంగా ఉంటారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు… ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకిస్తారని అన్నారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారని అన్నారు.. చంద్రబాబులా రోజుకు16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదని తెలిపారు…. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదని ఎద్దేవా చేశారు…

అలాగే తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీద ఉండేలా చంద్రబాబు నాయుడు డ్రామాలాడేవారని ఆరోపించారు… పుష్కరాల్లో30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి అనుబవజ్ఞుడు, విజనరీ ఎలా అవుతారని ప్రశ్నించారు.. సిఎం జగన్ రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారని అన్నారు దీంతో కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదేనని అన్నారు

హుదూద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు చంద్రబాబు నాయుడు దోచిపెట్టారని ఆరోపించారు. భూములు లేని వారికి నష్టం పరిహారం అలాగే నిజమైన బాధితులకు సిఎం జగన్ వచ్చాక న్యాయం జరిగిందని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ చాన్స్ మిస్సయిందని చంద్రబాబు నాయుడు ఏడుస్తున్నారని ఆరోపించారు…