ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఊరట లభించింది… ఇటీవలే ఆయన బెయిల్ కోసం వేసిన పీటీషన్ పై తాజాగా న్యాయస్థానం విచారించి బెయిల్ మంజూరు చేసింది… అచ్చెన్నాయుడు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది కోర్టు..
- Advertisement -
ఈఎస్ఐ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కుంటున్న అచ్చెన్నాయుడిని రెండు నెలల క్రితం ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే… నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు టెండర్లు ఇప్పించారనేది ఏసీబీ ప్రధాన ఆరోపణ..
కాగా ఈ కేసులో అచ్చెన్నాయుడుతో పాటు రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ మురళీ మరో నిందితుడు సుబ్బారావులు తోపాటు మొత్తం పది మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే…