ఏపీలో రోజుకి 10వేల కేసులు నమోదు అవుతున్నాయి, అయితే ఇంతలా కేసులు దారుణంగా పెరగడంతో పూర్తిగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే అన్ లాక్ పిరియడ్ 3 మొదలైంది,దీంతో ఈ అన్ లాక్ పిరియడ్ లో నైట్ కర్ఫ్యూని పూర్తిగా తొలగించారు.
ఆగస్ట్ 1 నుంచి అన్‌లాక్ 3 ప్రారంభించడంతో… రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కఠిన కండీషన్లను కాస్త తేలిక చేస్తోంది. జస్ట్ స్పందన వెబ్‌సైట్ నుంచి మీరు పేరు నమోదు చేసుకోవాలి, అయితే గతంలో దీనికి కాస్త సమయం పట్టేది వారం రోజులకి వచ్చేది పాస్.
కాని ఇప్పుడు దీనిని మరింత సరళతరం చేశారు.. ఈ-పాస్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. అది వారి మొబైల్, ఈమెయిల్‌కి వచ్చేస్తుంది.తమ మొబైల్ లేదా ఈమెయిల్‌కి వచ్చిన ఈ పాస్‌తోపాటూ… ఏపీకి వెళ్లేవారు సరైన ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ చెకింగ్ తర్వాత, ఎవరికి అయినా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి టెస్ట్ చేస్తారు. ఇక జస్ట్ 24 గంటల్లో మీకు ఈ పాస్ ఈజీగా వచ్చేస్తుంది అంటున్నారు అధికారులు.