ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన దూకుడును పెంచారు.. రాష్ట్రంలో మరో ఆరు జిల్లాలకు ఆరోగ్యశ్రీ విస్తరణ చేస్తున్నట్లువైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యంఖర్చుతో ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు…
వైద్యానికి వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తామని ఎన్నికల ప్రచారం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే… అందుకు అనుగునంగా ఆరోగ్యశ్రీ లో పలు మార్పులు చేసి తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరి3 నుంచి అమలు చేస్తున్నారు… తాజాగా విజయనగరం విశాఖ గుంటూరు ప్రకాశం కడప కర్నూల్ జిల్లాలో అమల్లోకి తీసుకువచ్చారు… ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీ వర్తింపు చేస్తామని అన్నారు…
కరోనా కూడా ఆరోగ్య శ్రీ చేసిని ఏకైక రాష్ట్రం ఏపీనే అని అన్నారు… వైద్యం కోసం ఎవ్వరు అప్పులు పాలు కాకుడని అన్నారు.. 42 లక్షల మందికి ఆరోగ్య శ్రీ కార్డు ఇచ్చామని అన్నారు… అధికారంలోకి రాకముందు ఆరోగ్యశ్రీలో 1059 చికిత్సలు ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీని 2200 చికిత్సలకు పెంచామని అన్నారు… అలాగే 27 టీచింగ్ ఆసుపత్రిలను ఏర్పాటు చేస్తున్నామని జగన్ అన్నారు… అలాగే నాన్యమైన మందులు ఇస్తున్నామని తెలిపారు…