దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉదేశ్యంతో.. రాష్ట్రంలో ప్రత్యేక వాహనాల ద్వారా వాలంటీర్లు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు.
రేషన్ బియ్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. రేషన్ కార్డుదారులకు బియ్యం వద్దంటే నగదు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టడానికి సిద్దమవుతుంది. కిలో బియ్యానికి రూ.12 నుంచి రూ.15 వరకు ఇచ్చే అవకాశం ఉంది. నేటి నుంచే ప్రజల అంగీకారం తీసుకునేందుకు సర్వే నిర్వహించనుంది.
వచ్చే నెల నుండి ఈ నగదు బదిలీ పథకాన్ని షురూ చేయాలనీ సీఎం జగన్ యోచిస్తున్నారట. ఇందులో భాగంగానే ఈ పథకం అనకాపల్లీ, నంద్యాల, కాకినాడ, నర్సాపురం, గాజువాకలను ఎంచుకొని అమలు చేయనున్నారట. ఐతే ఈ డబ్బులు నేరుగా ప్రజల ఖాతాలకే జమ చేస్తే మంచిదని ప్రభుత్వం ఆలోచిస్తుందట.