ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..కొత్తగా 3 లక్షల మందికి..

0
83

ఏపీ ప్రజలకు శుభవార్త. ఇప్పటికే ఎన్నో పథకాలను తీసుకొచ్చిన సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. గత ఏడాది డిసెంబర్ లో ప్రభుత్వం 1.50 లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది సర్కార్. అనంతరం డిసెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం జూన్ 15వ తేదీ మధ్య పింఛన్ల కోసం దరఖాస్తులు అందగా, వాటిని జూన్ 15-23 తేదీల మధ్య రెండు విడతలుగా పరిశీలిన జరిగింది. ఇందులో భాగంగా దాదాపు 3 లక్షల మంది పెన్షన్ కు అర్హులని తేల్చింది.

కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులందరికీ జూలై 19న పింఛను మంజూరు పత్రంతోపాటు పింఛన్‌ కార్డు, పాస్‌బుక్‌లను అందించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు 20 లక్షల మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. నవరత్నాల్లో భాగంగా వివిధ పథకాలతో పాటు వైఎస్‌ ఆర్‌ పింఛన్‌ కానుకను అమలు చేస్తున్నారు..అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా చూడాలని సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులను హెచ్చరిస్తున్నారు..దీనితో రాష్ట్రంలో కొత్తగా 3 లక్షల 98 మందికి సామాజిక పెన్షన్ అందనున్నాయి.