ఏపీ విద్యార్దుల‌కు మ‌రో గుడ్ న్యూస్

ఏపీ విద్యార్దుల‌కు మ‌రో గుడ్ న్యూస్

0
108

మార్చి నాల్గోవ వారం నుంచి దేశ వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూత ప‌డ్డాయి, విద్యార్దుల‌కు పెద్ద ఎత్తున సెల‌వులు ప్ర‌క‌టించారు… సుమారు మూడు నెల‌లుగా స్కూళ్లు తెర‌చుకోవ‌డం లేదు..కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు ప్రవేశపెట్టినప్పటికీ అంతలా ప్రాచుర్యం పొందడంలేదు. అయితే ప‌రీక్ష‌లు కూడా పూర్తిగా ర‌ద్దు చేసి నేరుగా త‌ర్వాత త‌ర‌గ‌తుల‌కి ప్ర‌మోట్ చేస్తున్నారు.

తాజాగా ఈ స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది విద్యాసంవత్సరంలో కీలక మార్పుల దిశగా అడుగులువేస్తోంది. ఇందులో భాగంగా 30 శాతం సిలబస్ ను తగ్గించేలా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తోంది.

ఈ ఏడాది పాఠశాల విద్యాసంవత్సరంను కూడా ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ ఉండే విధంగా ఆలోచన చేస్తోంది. అధికారులు దీనిపై ఆలోచ‌న చేస్తున్నారు, ఇక వైర‌స్ పూర్తిగా అదుపులోకి వ‌చ్చే వ‌ర‌కూ ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హించాలి అని చూస్తున్నారు..ఈ విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షలను కూడా మార్చి నుంచి ఏప్రిల్‌కు మార్పు చేసే దిశగా ఆలోచిస్తున్నారు.