ఏపీ యువతకు గుడ్ న్యూస్..పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

0
123

మార్కెట్ లో ఏ ఫోన్ రిలీజ్ అయినా..ఆఫ్ లైన్లో కంటే కూడా ఆన్ లైన్లో కొంత రాయితీతో మొబైళ్లను అందిస్తుంటాయి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినది ప్లిప్‌ కార్ట్‌. ఇక తాజాగా ఫ్లిప్ కార్డు యువతకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ప్లిప్‌ కార్ట్‌ ముందుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి, సీఈఓ ఎస్‌.సత్యనారాయణ వెల్లడించారు.

ప్లిప్‌ కార్ట్‌ లో దాదాపు 2500 వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వీటిని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులతో భర్తీ చేస్తామని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాలు స్థానిక యువతకు 75 శాతం కల్పించనున్నారు. మిగిలిన 25 శాతం ఓపెన్ క్యాటగిరీ కింద భర్తీ చేయనున్నారు. స్థానిక యువతకు ఇలా రిజర్వేషన్ కల్పించడంలో.. ఏపీ సీఎం జగన్ పాత్ర అమోఘమన్నారు.

ఈ సందర్భంగా ఫిప్ కార్ట్ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ లో ఆంధ్రప్రదేశ్‌ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఏపీ యువతకు ఉద్యోగాలు కల్పింటకు ఫిప్ కార్ట్ కూడా భాగస్వామి అవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇక ఈ ఉద్యోగాల్లో పది, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన వారితో భర్తీ చేస్తామని పేర్కొన్నారు. జీతాలు వారి అర్హతను బట్టి ఉంటుందని స్పష్టం చేశారు. రూ.18,000 నుండి రూ.3,00,000 వరకు వేతనంతో 2500 ఉద్యోగాలు కలిపిస్తామని తెలిపారు.