ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఉద్యోగులు తప్పకుండా తెలుసుకోండి

ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. ఉద్యోగులు తప్పకుండా తెలుసుకోండి

0
37

ఉద్యోగులు మెజార్టీ మందికి పీఎఫ్ ఖాతా ఉంటుంది.. సగం ఎంప్లాయ్ అలాగే సగం యజమాని పీఎఫ్ సొమ్మును కట్ చేస్తారు, అయితే ఈ ఫీఎఫ్ గురించి తాజాగా కొత్త ప్రకటన వచ్చింది అది తెలుసుకుందాం…పిఎఫ్ ఖాతా ఉన్న చాలా మందికి తమ ఖాతాలో సొమ్ము జమ అవుతున్నదీ లేనిదీ తెలీదు. దీనికి సంబంధించిన సొమ్మును ఎప్పటికప్పుడు ఆయా సంస్థలు జమ చేస్తూ ఉంటాయి. అయితే సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ కూడా వస్తుంది, ఇది మీకు ఎస్ ఎం ఎస్ రూపంలో మిస్ట్ కాల్ రూపంలో కూడా ఇప్పుడు తెలియచేస్తున్నారు.

అంతేకాదు ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ= విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు సంస్ధ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు అనేది ఈపీఎఫ్వో వెబ్సైట్లో నమోదు చేయాలి.. చాలా వరకూ ఇది కంపెనీలే చేస్తాయి కాని కొందరికి మాత్రం చేయడం లేదు దీని వల్ల ఆ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఇకపై ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్ను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఈపీఎఫ్ . దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ డేట్ ని ఎంటర్ చేసుకోవచ్చు. అయితే మీరు కంపెనీ మారిన రెండు నెలలు తర్వాత దీనిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.. ఒక నెల లేదా పది రోజులు 45 రోజులు ఇలా చేస్తే మాత్రం మీకు అది యాక్సెప్ట్ అవ్వదు. దీంతో ఉద్యోగులు ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.