రైతులకు గుడ్‏న్యూస్..పీఎం కిసాన్ 10వ విడతలో బెన్‏ఫిట్స్ ఇవే..

Good news for farmers..PM Kisan is the 10th installment of Ben Fits ..

0
85

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ. 6వేలు అందిస్తున్నారు. అయితే ఏప్రిల్-జూలై మధ్య మొదటి విడత. ఆగస్ట్-నవంబర్ మధ్య రెండవ విడత. డిసెంబర్-మార్చి మధ్య మూడవ విడతల వారిగా రూ. 2వేలు వారి అకౌంట్లలో జమ చేస్తారు.

అయితే ఈ పీఎం కిసాన్ నగదు వాయిదాల ప్రకారం ఆఆధార్ కార్డుతో లింక్ చేయబడిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రమే పంపిణీ చేస్తారు. అయితే ఇప్పటికే 9 విడతల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. ఇందులో కొందరు అన్నదాతలకు ఈ నగదు రాలేదు. అందుకు కారణం..వారి ఆధార్ నంబర్, ఖాతా నంబర్ వంటి ముఖ్య సమాచారన్ని తప్పుగా ఎంటర్ చేయడం.

ఇక పదవ విడత డిసెంబర్ నెలలో రానుంది. నివేదికల ప్రకారం డిసెంబర్ 15న రైతులు పదవ విడత డబ్బులు అందుకోనున్నారు. అయితే ఈ అమౌంట్ ను మరింత రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఈసారి లబ్ధిదారులకు రూ. 2 వేలకు బదులుగా రూ. 4 వేలు ఇవ్వాలని భావిస్తుందట.

అంతేకాకుండా పదవ విడతలో రైతులు మరో మూడు ప్రయోజనాలను అందుకోబోతున్నారు. ఇప్పుడు రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మన్ దన్ యోజన ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు వారికి ఈ పింఛను పథకాన్ని ప్రారంభించింది కేంద్రం. దీంతోపాటు రైతులు క్రెడిట్ కార్డు నుంచి రుణాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.

పీఎం కిసాన్ ఐడీ కార్డ్..
పీఎం కిసాన్ పథకం నుంచి అందిన డేటా ఆధారంగా రైతుల కోసం పీఎం కిసాన్ ID కార్డ్‌లను రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ స్కీమ్ యొక్క ల్యాండ్ రికార్డ్ డేటాబేస్‌కు లింక్ చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపు కార్డును సృష్టించవచ్చు. ఐడీ కార్డు రూపొందించిన తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పథకాలు రైతులకు సులభంగా చేరతాయి.

పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్..
పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ రైతుల కోసం పీఎం కిసాన్ పథకంతో అనుసంధానం చేయబడింది. ఈ స్క్రీమ్ కింద రైతులకు ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా.. ప్రభుత్వం వారికి సరసమైన ధరలకు రుణాలు అందిస్తుంది.

పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో పీఎం కిసాన్ మంధన్ యోజన పథకం కూడా ఉంది. ఇది రైతులకు పింఛను అందిస్తుంది. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులైతే, వారు పెన్షన్ స్కీమ్ కోసం కొత్త పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ మాన్ దన్ యోజనలో 60 ఏళ్లు నిండిన రైతులు పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రైతులకు కనీసం నెలకు రూ. 3000 పెన్షన్ లభిస్తుంది.