సీబీఐ కోర్టు జగన్ కు గుడ్ న్యూస్ ?

సీబీఐ కోర్టు జగన్ కు గుడ్ న్యూస్ ?

0
94

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతీ శుక్రవారం సీబీఐ కోర్టు ముందు హజరవుతున్నారు.. ఆయన పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన ప్రతీ వారం కోర్టుకు వెళ్లుతున్నారు.. అయితే సీఎం అయిన సమయంలో ఆయన పాలనలో బీజీగా ఉండటం, ప్రతీ వారం కోర్టుకు రావడం ఇబ్బందిగా ఉంటోంది ..అందుకే ఆయన ఈ వ్యక్తిగత హజరుపై మినహయింపు ఇవ్వాలి అని కోరారు. కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ మాత్రం పర్మిషన్ మినహయింపు ఇవ్వకూడదు అని తెలిపింది.

అయితే వారానికి 60 లక్షల రూపాయల ఖర్చు కూడా అవుతుంది అని చెప్పడం ఇక ప్రజా సేవలో సీఎంగా ఉండటంతో సీబీఐ కోర్టు కూడా ఆలోచిస్తోందట.. ఆయనకు వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు పై ఈ శుక్రవారం తీర్పు ఇస్తారు అని అంటున్నారు, ఇప్పటికే దీనిపై రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి, కాని గురు శుక్రవారం దీనిపై సీబీఐ కోర్టు తెలియచేస్తుంది, అయితే ఆయన విదేశాలకు వెళితే మాత్రం కచ్చితంగా పర్మిషన్ తీసుకువెళ్లాలి అని చెప్పనున్నారట. మొత్తానికి ఇది వైసీపీ అభిమానులకు పండుగ లాంటి వార్త అనే చెప్పాలి.