జమ్మలమడుగులో టీడీపీకి మరో గుడ్ న్యూస్

జమ్మలమడుగులో టీడీపీకి మరో గుడ్ న్యూస్

0
94

తెలుగుదేశం పార్టీలోకి కేవలం పదవుల కోసమే ఆదినారాయణ రెడ్డి వచ్చారు అనే విమర్శలు వాస్తవం అంటున్నారు అక్కడ తెలుగుదేశం నేతలు.. పార్టీ కష్టకాలంలో ఉంటే ఆయన మాత్రం బీజేపీలోకి వెళ్లడం ఏమిటి అని విమర్శలు చేస్తున్నారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఓటమితో వైసీపీపై నిత్యం విమర్శలు చేసే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైలెంట్ అయ్యారు.

దీంతో జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి మళ్లీ యాక్టీవ్ అయ్యారు, అయితే వైసీపీ తరపున గెలిచిన సుధీర్ రెడ్డి మాత్రం అక్కడ దూసుకుపోతున్నారు. ఈ సమయంలో వైసీపీలోకి సుబ్బారెడ్డి చేరిపోతున్నారు అని వార్తలు వచ్చాయి.. కాని ఆయన మాత్రం జమ్మలమడుగు టీడీపీని వదిలేది లేదు అంటున్నారు. ఆదినారాయణ రెడ్డి వెళ్లిపోయినా ఇక్కడ కేడర్ నాతోనే ఉంది అని చెబుతున్నారు.. ఆయన మాత్రం ఏ పార్టీలోకి వెళ్లను అని తెలుగుదేశం కేడర్ కు అండగా ఉంటాను అని చెబుతున్నారట.. మొత్తానికి వైసీపీకి మాత్రం ఇక్కడ పోటీ ఎప్పటికీ రామసుబ్బారెడ్డే అంటున్నారు అక్కడ కేడర్