విద్యుత్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న డీఏ చెల్లించాలని జగన్ సర్కార్ నిర్ణయ తీసుకున్నట్లు ప్రకటన చేశారు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి. ఉద్యోగులకు పెండింగ్ డీఏలను చెల్లించేలా ప్రభుత్వం ఉత్వర్వులిచ్చిందని… ఈ ఉత్తర్వులను విద్యుత్ రంగంలోని సిబ్బందికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించిందన్నారు.
పెండింగ్ లో ఉన్న 4 డీఏలను విడుదల చేస్తామని చెప్పారు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి అమల్లో ఉన్న పీఆర్సీ ఉత్తర్వులు మార్చి 31తో ముగుస్తాయన్నారు. కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు.
ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ పై వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ పై వారు ఎలా స్పందిస్తారో.. కమిటీ ఏం నివేదిక ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లేందుకు సన్నద్ధం అయ్యారు.