ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త..

0
109

దేశవ్యాప్తంగా పేదలకు రేషన్ కార్డు ఆధారంగా ఇంటి సభ్యులను బట్టి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  బియ్యం పంపిణి చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా సరుకుల కింద  ప్రజలకు బియ్యం, పంచదార, కందిపప్పులాంటి పదార్దాలు కూడా పంపిణి చేస్తున్నారు. ప్రస్తుతం ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదనే ఉదేశ్యంతో.. రాష్ట్రంలో ప్రత్యేక వాహనాల ద్వారా వాలంటీర్లు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు.

రేషన్ బియ్యంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు బియ్యం వద్దంటే నగదు ఇచ్చేందుకు  ఏపీ ప్రభుత్వం సిద్దమవుతుంది. కార్డుదారులు ముందుగా తమకు రేషన్ వద్దంటూ వాలంటీర్లకు చెప్పాలి. దాంతో ఆ బియ్యం విలువ మేరకు నగదు చెల్లిస్తారు. కిలో బియ్యానికి రూ.12 నుంచి రూ.15 వరకు ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు వాలంటీర్లు ప్రజల నుంచి అంగీకార పత్రాలు తీసుకుంటారు. VRO పరిశీలన అనంతరం తహసీల్దార్ వీటిని ఆమోదించనున్నట్టు తెలిపారు. అనంతరం వచ్చేనెల 1వ తేదీ నుంచి రేషన్ బియ్యం బదులు డబ్బులను కార్డుదారులకు అందజేస్తారు. అనంతరం నగదు కూడా పంపిణీ చేస్తారు. ఐతే ఈ డబ్బులు నేరుగా ప్రజల ఖాతాలకే జమ చేస్తే మంచిదని ఆలోచిస్తున్నట్టు సమాచారం.