సీమ నేతలకు గుడ్ న్యూస్ చెప్పనున్న బాబు

సీమ నేతలకు గుడ్ న్యూస్ చెప్పనున్న బాబు

0
95

తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో సీమ జిల్లాలో మూడే మూడు సీట్లు ఇచ్చారు ప్రజలు.. ఒకటి చంద్రబాబు రెండు బాలయ్య, మూడు పయ్యావుల కేశవ్.. ఈ మూడు సీట్లు మినహా మరెక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఇలా పార్టీ పెట్టిన సమయం నుంచి ఇంత దారుణమైన రిజల్ట్ పార్టీకి ఎక్కడా రాలేదు. అయితే చంద్రబాబు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చినా, అక్కడ పార్టీని సరి అయిన కేడర్ తో నిలపలేకపోయారు అనే విమర్శలు వచ్చాయి.

ఇక్కడ ప్రాంతాన్ని డవలప్ చేయలేదు అని , అక్కడ ప్రజలు విమర్శిస్తారు.. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పుతో తాజాగా బాబు ఆలోచనలో కూడా మార్పు వచ్చింది అంటున్నారు… సీమ ప్రాంతంలో వారికి పార్టీ నేతలకు మరింత ప్రయారిటీ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు బాబు.. అందులో తొలి అడుగు తెలుగు యువత పదవి అని తెలుస్తోంది .. అంతేకాదు రాయలసీమ ప్రాంతంలో వారికి కొత్తగా పదవులు కూడా క్రియేట్ చేయనున్నారు పార్టీలో అని వార్తలు వస్తున్నాయి, అయితే ఇదంతా పార్టీ మళ్లీ పునర్వైభవం పొందడానికి అంటున్నారు పార్టీ శ్రేణులు.