Big Breaking: తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Good news for Teenmar Mallanna fans

0
93

తీన్మార్ మల్లన్న ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. మొత్తం 38 కేసులో 32 కేసులకి సంబంధించి మల్లన్నకు బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. అలాగే మిగిలిన 6 కేసులని న్యాయస్థానం కొట్టివేసింది. నిజామాబాద్ జిల్లాలో కళ్ళు వ్యాపారి వద్ద మల్లన్న టీం డబ్బులు వసూలు చేస్తుందని, ప్రముఖ జ్యోతిష్యుడి నుంచి ఏకంగా 30 లక్షలు డిమాండ్ చేసినట్లు మల్లన్నపై ఆరోపణలు ఉన్నాయి.

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యవహారంపై కూడా తీన్మార్ మల్లన్నపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో తీన్మార్ మల్లన్న ఉన్నారు. అయితే పై కేసులు అన్నిటిలోనూ తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు అయింది. ఇదిలా ఉంటే ఇటీవలే తీన్మార్ మల్లన్న కుటుంబం..అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే.