తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రాగా తాజాగా వైద్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 1,326 డాక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇందులో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ 751, ట్యూటర్ పోస్టులు 357, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులు 211 ఉన్నాయి. జులై 1 నుంచి ఆగష్టు 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.