ఏపీలో ప్రభుత్వ ఖాళీ పోస్టులు, ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగ ఖాళీలపై వివరించాలని సభ్యులు కోరగా..ప్రభుత్వం ఈ విధంగా సమాధానమిచ్చింది. అన్ని జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి 66,309 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు – 66 వేల 309.
మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు – 7 లక్షల 71 వేల 177.
శాశ్వత ఉద్యోగులు – 5 లక్షల 29 వేల 868.
కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు – లక్షా 75 వేలు.
మొత్తం శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు 7 లక్షల 4 వేల 868.
గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు లక్షా 27 వేలు.
వైద్యారోగ్యశాఖలో భర్తీ చేసిన ఉద్యోగాలు 22 వేల 306.