తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆరే ఉద్యోగాల ప్రకటన చేశారు. దీనితో ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాలను సైతం విడుదల చేశారు. దీనితో నిరుద్యోగులు అలర్ట్ అయ్యారు.
ఇప్పటికే జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ లో చొప్పున ఉన్న ఖాళీల వివరించారు. అతి త్వరలోనే ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు విడుదల అవుతాయని కూడా ప్రకటించారు. అలాగే ఏజ్ లిమిట్ పై కూడా కేసీఆర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయో పరిమితిని పదేళ్లపాటు పెంచింది. దీనికి సంబంధించి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో 34 ఏళ్లుగా ఉన్న గరిష్ఠ అర్హత వయస్సు 44 ఏళ్లకు పెరిగింది. గరిష్ఠ వయో పరిమితి పెంపు రెండేళ్ల పాటు వర్తించనుంది. ఉత్తర్వులు జారీ అయిన రోజు నుంచి రెండేళ్ల పాటు అంటే 2024 మార్చి 18 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, యూనిఫాం సర్వీసులైన పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, అటవీశాఖ ఉద్యోగాలకు మాత్రం గరిష్ఠ వయో పరిమితి పెంపు వర్తించదు.