ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

0
101

ఏపీ: నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపనచేశారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నై, విశాఖ, ముంబై మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టు ఉందని.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.

అంతేకాదు రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని ప్రకటించారు. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు. పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుందని తెలిపారు.

కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయి.. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. వీటిద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని.. దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.