ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..26 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్!

0
118

ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. పోలీస్ శాఖపై కొన్ని నెలల క్రితం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశంలో పోలీస్ శాఖలో ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు. దానికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించాలని సీఎం ఆదేశించారు.

రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగిలిన పోస్టులను దశల వారీగా భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఐతే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనేది ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.