నిరుద్యోగులకి గుడ్ న్యూస్ భారీగా ఉద్యోగాలు వదిలిన సీఎం జగన్

నిరుద్యోగులకి గుడ్ న్యూస్ భారీగా ఉద్యోగాలు వదిలిన సీఎం జగన్

0
91

ఏపీలో ఇప్పటికే దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు సీఎం జగన్, తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి గ్రామ సచివాలయ పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, తాజాగా నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లోని గ్రామ సచివాలయాల్లో 14 వేలకుపైగా పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ముగియనుంది. జనవరి 30 లోగా ధరఖాస్తు చేసుకోవాలి అని నోటిఫికేషన్ తెలియచేశారు. పోస్టుల వివరాలు చూద్దాం.

1. పంచాయతీ కార్యదర్శి పోస్టులు ..
ఖాళీల సంఖ్య: 61
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

2. VRO (గ్రేడ్-2) పోస్టులు
ఖాళీల సంఖ్య: 246
అర్హత: పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

3. ANM (గ్రేడ్-3) పోస్టులు..
ఖాళీల సంఖ్య: 648
అర్హత: పదోతరగతి విద్యార్హత ఉండాలి. (MPHA)కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

4. ఏనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులు..
ఖాళీల సంఖ్య: 6858
అర్హతలు..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నుంచి రెండేళ్ల పాలిటెక్నిక్ పూర్తిచేసి ఉండాలి. (లేదా)

5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ పోస్టులు..
ఖాళీల సంఖ్య: 69
అర్హతలు..
పాలిటెక్నిక్ డిప్లొమా ఇంటర్ ఒకేషనల్ ఫిషరీస్/ఆక్వాకల్చర్

6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1783
అర్హతలు..
నాలుగేళ్ల బీఎస్సీ హార్టికల్చర్

7.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్-2) పోస్టులు..
ఖాళీల సంఖ్య: 536
అర్హతలు..
నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్

8. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు..
ఖాళీల సంఖ్య: 43
అర్హతలు..
ఇంటర్ ఒకేషనల్ సెరికల్చర్/ బీఎస్సీ సెరికల్చర్

9.మహిళా పోలీసు అధికారి పోస్టులు.
ఖాళీల సంఖ్య: 762
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

10. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2) పోస్టులు..
ఖాళీల సంఖ్య: 570
అర్హత: డిగ్రీ/డిప్లొమా (సివిల్/మెకానికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

11. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్) పోస్టులు
ఖాళీల సంఖ్య: 1134
అర్హతలు: డిగ్రీ డిప్లొమా

12. విలేజ్ సర్వేయర్ పోస్టులు..
ఖాళీల సంఖ్య: 1255
అర్హతలు: NCTV డ్రాట్స్మ్యాన్ సర్టిఫికేట్ సివిల్ ఇంటర్ ఒకేషనల్ సర్వేయింగ్

13. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు..
ఖాళీల సంఖ్య: 97
అర్హతలు: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.

వీటికి ఈ నెల 30 లోపు ధరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉంది.