శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు మరో కొత్త తలనొప్పి

శాసనమండలి రద్దు విషయంలో జగన్ కు మరో కొత్త తలనొప్పి

0
34

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయడంతో ఇక తాము సాధించాము అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు, కాని దీనికి టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు, ఇల్లు అలకగానే పండగ కాదు అని కౌంటర్లు వేస్తున్నారు, కేవలం మీరు శాసనసభలో తీర్మానం మాత్రమే చేయగలరు అని అంటున్నారు.

ఏపీ సీఎం జగన్పై టీడీపీ ఎంపీ కేశినేని నాని వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. తాజాగా శాసన మండలి రద్దు అంశం పై ఎంపీ కేశినేని నాని జగన్ అన్నా నువ్వూ నీ ముఠా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి అమరావతి నుండి రాజధానిని ఒక అంగుళం కూడా కదల్చలేరని అన్నారు.

అంతేకాదు హైకోర్టును కూడా అమరావతి నుండి మార్చలేరని, శాసనమండలిని రద్దు చెయ్యాలనే మీ ప్రతిపాదన జరిగే పని కాదని అసలు మీ వల్ల ఏదీ కాదని ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని పోస్ట్ చేశాడు. అయితే ఆయన చెప్పే విషయం చూస్తే,అయితే ఇలా చాలా స్టేట్స్ శాసనమండలి రద్దు, కావాలి అని ప్రపోజల్స్ తీసుకువస్తున్నాయి, అందుకే ఈ విషయంలో ఓ జాతీయ విధానం ఉండాలంటూ గతంలో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటయ్యిందని, ఆ కధనం చెబుతోంది.

కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మండలిని రద్దు చేసుకుంటూ పోవడం సరికాదని ఆ కమిటీ అభిప్రాయపడిందని అందులో పేర్కొన్నట్టుగా గుర్తు చేశారు, కాని కేంద్రం తలచుకుంటే ఇది సులువు అనేది వైసీపీ చెబుతున్న మాట.