వైయస్సార్ కాపునేస్తం అప్లై చేసుకున్నారా మీకో గుడ్ న్యూస్

వైయస్సార్ కాపునేస్తం అప్లై చేసుకున్నారా మీకో గుడ్ న్యూస్

0
82

ఏపీలో నెలకి ఓ సంక్షేమ పథకం అమలు చేస్తున్న వైయస్ జగన్ సర్కారు ..ఈనెలలో ఉగాదికి ఉచిత ఇళ్లపట్టాలు పేదలకు ఇవ్వనున్నారు, దీని తర్వాత ఆయన ప్రభుత్వం వైయస్సార్ కాపునేస్తం అందించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం ఇలా ఐదు సంవత్సరాలకు 75 వేలు ఇవ్వనున్నారు.

వైయస్సార్ కాపు నేస్తం అనేది చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెబుతున్నారు అధికారులు.. అప్లై చేసుకున్న కాపులకు అందరికి మొత్తం 1000 కోట్లు అందించనున్నారు, అలాగే మొత్తం ఆరు లక్షల మందికి ఇది వర్తించనుంది అని తెలుస్తోంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు కాపు మహిళలు మాత్రమే వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి.

నెలకి గ్రామాల్లో 10 వేలు పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి
కారు ట్రాక్టర్ ఉండకూడదు
మూడెకరాల మాగాణీ – పదెకరాల మెట్ట భూమి గరిష్టంగా ఉండాలి
కుటుంబంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు.

ఇలా అప్లై చేసుకున్న వారికి వచ్చేనెల నగదు జమ కానుంది వారి అకౌంట్లో అని తెలుస్తోంది.