ఈ షాపుల్లో కిలో చికెన్ 30 ఇంకా ఆఫర్లు వింటే మతిపోతుంది

ఈ షాపుల్లో కిలో చికెన్ 30 ఇంకా ఆఫర్లు వింటే మతిపోతుంది

0
28
Pieces of raw chicken meat. Raw chicken legs in the market.

ఫౌల్ట్రీ మార్కెట్పై కరోనా వైరస్ ప్రభావం బాగా కనిపిస్తోంది, పెద్ద ఎత్తున ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని భయపడుతున్నారు జనం , అంతేకాదు కోడి మాంసం తింటే ఈ వైరస్ సోకుతుంది అని జరిగిన ప్రచారంతో ఇక చికెన్ తినేవారు తగ్గిపోయారు, అసలు రెస్టారెంట్లు కూడా ఖాళీ అయ్యాయి, ఇక గుడ్డు కోడి ఎక్కడా ఎవరూ తినడం లేదు ..దీంతో 200 ఉండే చికెన్ ఇప్పుడు కిలో 30 లేదా 50 కి దొరుకుతోంది.

ఓ వైపు దాణా వేసి పెంచలేక.. ఉన్నా వాటిని తక్కువకి అమ్మలేక వ్యాపారులు చాలా సతమతమవుతున్నారు..
ఇటీవల తెలంగాణలో నాలుగు కేజీల చికెన్ రూ.100 అమ్మితే.. తాజాగా కర్నూలు జిల్లాలో కేజీ చికెన్ను రూ.40కు అమ్మేస్తున్నారు..

గూడూరు నగర పంచాయతీ పరిధిలో ఓ చికెన్ షాపు యజమాని కిలో కోడి మాంసాన్ని రూ.40కే ఇస్తానని బోర్డు పెట్టారు.ఇక నష్టం వస్తున్నా ఏదో ఒకటి సొమ్ము చేసుకోవాలి అని అనుకుంటున్నారు.
ఇక మరో వ్యక్తి కిలో 30 రూపాయల చికెన్ ధర పెట్టాడు
మరో వ్యక్తి 50 రూపాయలకి కిలో చికెన్ అల్లం వెల్లులి పేస్ట్ చికెన్ మసాలా ఇస్తున్నాడు
మరో వ్యక్తి కిలో చికెన్ 60 పెట్టి ఆఫ్ లీటర్ డ్రింక్ బాటిల్ కోకో కోలా ఫ్రీగా ఇస్తున్నాడు