ఫ్లాష్ న్యూస్– బుద్దావెంకన్న, బోండా ఉమా పై కర్రలతో దాడి కారు ద్వంసం

ఫ్లాష్ న్యూస్-- బుద్దావెంకన్న, బోండా ఉమా పై కర్రలతో దాడి కారు ద్వంసం

0
76

తెలుగుదేశం పార్టీ నాయకులు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు, తమని టార్గెట్ చేసి మరీ దాడి చేశారు అని బుద్దా వెంకన్న బొండా ఉమా అంటున్నారు.

తెలుగుదేశం నేతలు ఈ ప్రాంతానికి వస్తున్నారు అని తెలియడంతో పక్కా స్కెచ్ వేసి తమపై దాడి చేశారు అని పెద్ద పెద్ద కర్రలతో వెంబడించారు అని అంటున్నారు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగింది…టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందనే వార్తలతో తెలుగుదేశం నేతలు రంగంలోకి దిగారు.

ఈ సమయంలో పెద్ద కర్రతో ఓ వ్యక్తి వీరు ప్రయాణిస్తున్న కారుని అద్దాలని పగలకొట్టారు, వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ అక్కడ నుంచి కారుని ముందుకు పోనిచ్చాడు, ఇప్పుడు అక్కడ నుంచి నల్గొండ మీదుగా వెళుతున్నాము అంటున్నారు ఈనేతలు, పోలీసులు ఉన్నా సరే తమపై దాడి చేశారు అని అన్నారు, దీంతో జిల్లాలో ఒక్కసారిగా దీనిపై చర్చ జరుగుతోంది.