ఇప్పటికే రష్యా కరోనాకి వ్యాక్సిన్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే, దాదాపు 9 నెలలుగా అన్నీ దేశాలు కూడా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి, ఈ సమయంలో కరోనాపై పోరాటంలో భాగంగా రష్యా స్పుత్నిక్ వి తీసుకువచ్చింది., అయితే ముందు దీనిని అందరూ కూడా వ్యతిరేకించారు, సరైన టెస్ట్ లేకుండా రెండు మూడు నెలల్లో తీసుకువచ్చారు.
అయితే స్పుత్నిక్ వి పనితీరు బాగుంది అని ప్రారంభ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని మెడికల్ జర్నల్ లాన్సెట్ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అందరిలో యాంటీబాడీలు డవలప్ అయ్యాయి, అంతేకాదు ఎవరికి ప్రాణాపాయం లేదు.
స్పుత్నిక్-v సరిగా పనిచేయదన్న వాళ్లకు తొలి పరీక్షల్లో తేలిన అంశాలే సమాధానమని రష్యా ప్రభుత్వం అంటోంది, అంతేకాదు రెండు దశల పరీక్షల్లో 76 మందికి ఇస్తే అందరూ బాగానే ఉన్నారు అని తెలిపింది…అంతేకాకుండా రష్యా గత వారం 40వేల మందిపై పరీక్షలు జరిపింది. ఆ ఫలితాలు కూడా వచ్చే రోజుల్లో రానున్నాయి.. నెలకు 20 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేయనున్నాము అని తెలిపింది రష్యా.