ఇంటికి కట్టిన గుమ్మడికాయ ఏ సమయంలో తీయాలో తెలుసా

ఇంటికి కట్టిన గుమ్మడికాయ ఏ సమయంలో తీయాలో తెలుసా

0
37

మనం నరదిష్టి తగలకుండా ఉండాలి అని కచ్చితంఆ ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ కడతాం, ఇది మన దేశంలో చాలా ప్రాంతాల్లో పాటిస్తారు, అయితే దీని వల్ల చెడు దృష్టి చూపు మనవైపు ఉండవు ఆ ఇంటికి మంచి జరుగుతుంది.. అందుకే ఈ గుమ్మడికాయని కడతారు, అయితే సొంత ఇల్లు ఉన్నా అద్దె ఇంట్లో ఉంటున్నా ఇలా కట్టుకోవడం మంచిది.

గుమ్మానికి కరెక్టుగా మధ్యలో కట్టుకోవాలి, అయితే ఈ కాయ ఎప్పుడు తీయాలి, కుళ్లిన సమయంలోనే కాదు కొన్ని తిధులలో గుమ్మడికాయ తీయాలి, అంతేకాదు కొన్ని ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో కూడా గుమ్మడికాయ ఇంటికి ఉంది తీసేయాలి.. మరి ఆ సమయాలు ఏమిటో చూద్దాం.

సూర్య చంద్రగ్రహణములు వచ్చిన సమయంలో ఆ గుమ్మడికాయ తీసేయాలి
పురుడు మైల వచ్చిన సమయంలో తీసేయాలి
పక్షిణి చేసిన సమయంలో తీసేయాలి
చావునకు సంబంధించి సూతకం వచ్చినా తీసేయాలి
ఇంట్లో అమ్మాయి పుష్పవతి అయిన తీసేయాలి
ఒకవేళ ఇలా ఉంచితే ఆ గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది.

ఇక ఆ సూతకం కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కట్టాలి అని చెబుతున్నారు పండితులు. ఏ ఫంక్షన్ కి ముందు గుమ్మడికాయ మార్చి కట్టకూడదు.