గుడ్ న్యూస్ – తగ్గిన బంగారం ధర – వెండి రేట్లు ఇవే

గుడ్ న్యూస్ - తగ్గిన బంగారం ధర - వెండి రేట్లు ఇవే

0
88

పుత్తడి ధర నిన్నటి వరకూ పరుగులు పెట్టింది.. ఈ వారంలో చూసుకుంటే బంగారం ధర పెరగడం కాని ఎక్కడా తగ్గలేదు, అయితే పుత్తడి ధర వచ్చే రోజుల్లో తగ్గుముఖం పడుతుంది అని బులియన్ అనలిస్టులు చెప్పారు.. కాని కరోనా కేసులు మళ్లీ పెరగడంతో బంగారం ధర పెరుగుతోంది. షేర్ల కంటే బంగారంపైనే పెట్టుబడి పెరిగింది. అయితే ఈరోజు మార్కెట్లో బంగారం ధర తగ్గింది.

 

 

హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.48,160కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గి రూ.44,150కు చేరింది.

 

బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా తగ్గింది.. వెండి ధర కేజీకి రూ.600 తగ్గుదలతో రూ.73,600కు ట్రేడ్ అవుతోంది, అయితే గత పది రోజులుగా చూసుకుంటే బంగారం ధర తగ్గడం ఇదే అంటున్నారు బులియన్ వ్యాపారులు. సో వచ్చే రోజుల్లో కరోనా పరిస్దితి బట్టీ రేటు పెరగడం తగ్గడం ఉంటుంది అని చెబుతున్నారు.